నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ పట్టణంలోని పానగల్లులో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయంలో ఇటలీ దేశస్తులు సందడి చేశారు. దేశంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడాలని వచ్చిన ఇటాలియన్స్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అజయ్ కుమార్ ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.
