ఇవాళ్టి నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు

ఇవాళ్టి  నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు
  • ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్ల క్రాస్​ ఎగ్జామినేషన్ 
  • రోజుకు ముగ్గురు చొప్పున విచారణ 
  • పొద్దున, మధ్యాహ్నం కలిపి రెండు సెషన్స్ 

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ కమిషన్ బుధవారం నుంచి ఓపెన్ కోర్టు విచారణ చేయనుంది. ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, కొంత మంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్​ ఇంజినీర్లను క్రాస్​ఎగ్జామిన్ చేసేందుకు ఓపెన్ కోర్టు ఎంక్వైరీ చేపట్టనుంది. ఇందుకోసం బీఆర్కే భవన్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, తీసుకున్న ఆధారాలు, సమన్లు జారీ చేసిన వాళ్లు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్​ బృందం క్రాస్​ఎగ్జామిన్ చేయనుంది. దాదాపు 30 మందిని ఓపెన్​కోర్టుకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున.. వారం, పది రోజులు ఓపెన్​కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్​కు విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​మధ్యంతర నివేదిక కూడా అందింది. దాంట్లో అంశాలను కూడా క్రాస్ ఎగ్జామిన్​లో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. ఎన్​డీఎస్ఏ చైర్​పర్సన్​ను కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ మురళీధర్, నాగేందర్ రావును కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు... మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్​గా బహిరంగ విచారణ చేయనుంది.


రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున.. వారం, పది రోజులు ఓపెన్​కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్​కు విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​మధ్యంతర నివేదిక కూడా అందింది. దాంట్లో వెల్లడైన అంశాలను కూడా క్రాస్ ఎగ్జామిన్​లో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. ఎన్​డీఎస్ఏ చైర్​పర్సన్​ను కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ మురళీధర్, నాగేందర్ రావును కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్ గా బహిరంగ విచారణ చేయనుంది. ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో విజిలెన్స్ రిపోర్టులో క్లారిటీ లేకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల అంశాలపై అదనపు సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్​కోరినట్టు తెలిసింది. అదే విధంగా ఇప్పటివరకు అఫిడవిడ్ సమర్పించని మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ సన్నద్ధమవుతున్నది.  

పంప్ హౌస్ లపైనే ఫోకస్.. 

జస్టిస్​పీసీ ఘోష్​కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పంప్​హౌస్​లపైనే ఫోకస్​పెట్టింది. పంప్ హౌస్​ల్లోనే భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించింది. ఎవరికీ అంతు చిక్కకుండా పంపుల కొనుగోలు వ్యవహారం ఉన్నట్టు కమిషన్​భావిస్తున్నది. ఇందులో మతలబేంటో తేల్చేందుకు క్రాస్​ఎగ్జామిన్​లో తనదైన శైలిలో జస్టిస్ పీసీ ఘోష్​ఎంక్వైరీ చేయనున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం పంప్‌‌‌‌‌‌‌‌హౌస్​ల మునకకు కారణమేంటని కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లను ఓపెన్​కోర్టులో తగిన ఆధారాలతో ప్రశ్నించనున్నారు. ప్రతిపాదిత ఫుల్​రిజర్వాయర్​లెవెల్​(ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్)కు తక్కువ ఎత్తులో పంప్​హౌస్​లను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే కారణాలపై ఇప్పటి వరకు ఎవరెవరు ఏం చెప్పారు ? అనే దానిపై ఎవిడెన్స్ తో సహా ఎంక్వైరీ చేయనున్నారు. పంప్​హౌస్​ల నిర్మాణానికి అయిన ఖర్చు,  టెండర్ల ప్రక్రియ సాగిన తీరు, పంప్ హౌస్ ల మునగడానికి బాధ్యులెవరనే వివరాలను ఓపెన్​కోర్టులో రాబట్టాలని చూస్తున్నారు.