T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేసింది. మొదట జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే ఓపెనర్లు తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్ తీవ్ర నిరాశ పరిచారు. రెండో ఓవర్ వేసిన క్వేనా మఫాకా బౌలింగ్ లో మారుమణి (7) అవుట్ అయ్యాడు. అనంతరం మరో 14 పరుగులు జోడించిన తర్వాత అన్రిచ్ నార్ట్జే బౌలింగ్ లో ఇంకో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (15) ప్రోటీస్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన డియోన్ మైయర్స్ సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జార్జ్ లిండే బౌలింగ్ లో డెవాల్డ్ బ్రీవిస్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యడు.
అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఒక్కడే ఒంటరి పోరాటం కొనసాగించాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 73 పరుగులు చేసి క్వేనా మఫాకా బౌలింగ్ లో డెవిడ్ మిల్లర్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు. తర్వాత క్రీజులో వచ్చిన జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్ 5), టోనీ మునియోంగా (2), బ్రాడ్ ఎవాన్స్ 8), వెల్లింగ్టన్ మసకద్జా (1) విఫలమైనప్పటికీ చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్ క్లైవ్ మదాండే మాత్రం కాసేపు సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో 20 బంతుల్లో 3 ఫోర్లలో 26 పరుగులు చేసి క్రీజులో అజేయంగా నిలిచాడు.
ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్, క్వేనా మఫాకా చెలో రెండు వికెట్లు పడగొట్టగా, అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్‌గిడి, జార్జ్ లిండే తలో వికెట్ తీసుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే టీమ్ కేవలం 153 పరుగులు చేసి 7 వికెట్లను చేజార్చుకుంది. అయితే సౌతాఫ్రికా జట్టు 154 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.
