మాల్లో విజయ్ దివస్ వేడుకలు

మాల్లో విజయ్ దివస్ వేడుకలు

కేపీహెచ్​బీ కాలనీలోని లులు మాల్​లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు కార్గిల్ విజయ దివస్ వేడుకలు జరగనున్నాయి. ఆర్మీ ఆయుధాల ప్రదర్శన, రిటైర్డ్ జవాన్ల సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇండియన్ ఆర్మీ సామర్థ్యాన్ని ప్రదర్శించేలా వేడుకలు ఉంటాయని రీజినల్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదిర్ షేక్ తెలిపారు. ఈ ఏర్పాట్లను చూడడానికి గురువారం సందర్శకులు అధిక సంఖ్యలో వచ్చారు. – వెలుగు, కూకట్​పల్లి