- డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
- కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలో
ప్రధానమైన డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి తమ పాలకవర్గం కృషి చేస్తుందని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. గురువారం సిటీలో మీడియాతో మాట్లాడుతూ సునీల్ రావు మాట్లాడుతూ గత 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో డంప్ యార్డు సమస్య పరిష్కారం కాలేదన్నారు.
గతేడాది కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ పర్యటనలో సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం చూపుతామన్నారని, ఆ దిశగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్ సత్యనారాయణ రెడ్డి, లీడర్లు దేశవేదం, బండ రమణారెడ్డి, ఎన్నం ప్రకాశ్, శివరాం, అనిల్,- పాల్గొన్నారు.
