కుక్క కాటుతో చనిపోతే రూ.5 లక్షలు

కుక్క కాటుతో చనిపోతే రూ.5 లక్షలు
  • గాయపడితే రూ.5 వేల పరిహారం అందిస్తాం 
  • కర్నాటక ప్రభుత్వం ప్రకటన

బెంగళూరు: వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి కర్నాటక ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. కుక్క కాటుకు గాయపడిన వారికి రూ.5 వేల పరిహారం అందించేలా చర్యలు చేపట్టింది. ఈ ఐదు వేలల్లో రూ.3,500 నేరుగా బాధితుడికి అందజేస్తారు. మిగతా రూ.1,500ను సువర్ణ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌కు చికిత్స ఖర్చుల కోసం కేటాయిస్తారు. కాగా, తమిళనాడులో కుక్క కాటు బాధితులు పెరుగుతున్నారని కాంగ్రెస్  నేత చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు  ఆదేశాల అమలుకు అందరూ సహకరించాలని కోరారు.