హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) అస్థికలను ఆయన కొడుకు కావూరి భాస్కర్ కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. శనివారం ఉదయం విజయవాడ సమీపంలోని కృష్ణా నది తీరానికి చేరుకున్న భాస్కర్.. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పితృకర్మలను నిర్వహించారు. అనంతరం తండ్రి అస్థికలను నదీ ప్రవాహంలో నిమజ్జనం చేశారు.కార్యక్రమంలో భాస్కర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. సాంబశివరావు బుధవారం ఉదయం కన్నుమూశారు.
బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సాంబశివరావు అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ (రాయదుర్గం) మహాప్రస్థానంలో గురువారం జరిగాయి. ఆయన ఏపీలోని మచిలీపట్నం, ఏలూరు నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
