
- జీహెచ్ఎంసీ ఇచ్చిన పర్మిషన్లు ఎట్ల తప్పయితయ్?: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కొన్ని ప్రాంతాల్లో అధికారిక అనుమతులు ఉన్న భవనాల్ని కూడా హైడ్రా నేలమట్టం చేయడం బాధాకరమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు.
అక్రమ నిర్మాణాలను తాము సమర్థించబోమని, కానీ.. తీసుకునే చర్యలు న్యాయబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన గురువారం లేఖ రాశారు. ‘‘కొన్నిచోట్ల జీహెచ్‌ఎంసీ అనుమతులు ఇచ్చిన తర్వాతే ప్రజలు ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు కొన్నారు. రోడ్లు, విద్యుత్, వాటర్, డ్రైనేజీ కనెక్షన్స్ ఉన్నప్పుడు.. నిర్మాణాలు న్యాయబద్ధంగా ఉన్నాయని అందరూ భావిస్తారు కదా..’’అని కిషన్ రెడ్డి అన్నారు.