సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్ల పట్టణం 10వ వార్డు చిన్నబోనాల పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచారం రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సోమవారం రాత్రి ముత్యంరాజు అనే రైతుకు చెందిన దూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది.
ఈ ఘటనతో ఆ ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పంట పనుల కోసం రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాల్సి వస్తుండటంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చిరుతపులిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
