- మున్సిపల్ చైర్పర్సన్ సుజాత
మధిర, వెలుగు : మున్నిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మధిర మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత తెలిపారు. గురువారం మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ గా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం నూతన పాలకవర్గంతో కలిసి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీలో పెండింగ్సమస్యలను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ప్రజలు నూతన పాలకవర్గంపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్సిపాలిటీలోని సమస్యలను గుర్తించి వారి పరిష్కారం కోసం నిరంతరంకృషి చేస్తామని తెలిపారు.
కౌన్సిలర్లను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకువెళ్తామని వివరించారు. అనంతరం చైర్పర్సన్ సామినేని సుజాత, వైస్ చైర్పర్సన్ ధనికుమార్, కౌన్సిలర్లను కాంగ్రెస్, టీడీపీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు మధిరలోని కాంగ్రెస్కార్యాలయంలో మున్సిపల్ నూతన పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమిషనర్సంపత్కుమార్, కాంగ్రెస్మధిర మండల, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశెట్టి కిశోర్, మిర్యాల వెంకటరమణగుప్తా, చావా వేణు, డివిజన్ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
