భద్రాచలం, వెలుగు : మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం గోదావరికి నదీ హారతిని ఇచ్చారు. గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం నిర్వహించారు. గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి, శ్రీరామ అష్టోత్తరం పఠిస్తూ ముందుగా సీతారామచంద్రస్వామికి 12 సార్లు, గోదావరికి 21 సార్లు హారతిని సమర్పించారు. కలెక్టర్ జితేశ్, ఐటీడీఏ పీవో బి.రాహుల్ దంపతులు, సర్పంచ్ పూనెం కృష్ణదొర, తహసీల్దారు ధనియాల వెంకటేశ్వర్లు భక్తులు పాల్గొన్నారు.
