మావోయిస్టులు లొంగిపోవాలి.. నా నెంబర్కు ఫోన్ చేయండి: మల్లోజుల వేణుగోపాల్ వీడియో రిలీజ్

మావోయిస్టులు లొంగిపోవాలి..  నా నెంబర్కు ఫోన్ చేయండి: మల్లోజుల వేణుగోపాల్ వీడియో రిలీజ్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ వీడియో రిలీజ్ చేశారు గడ్చిరోలి పోలీసులు. 2025 నవంబర్ 19వ తేదీన విడుదల చేసిన వీడియో సందేశంలో .. మావోయిస్టులు లొంగిపోవాలని మల్లోజుల పిలుపునిచ్చారు. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం‌కూడ మారుతోంది.. మావోయిస్టులు లొంగిపోవడం మంచిది అని అన్నారు.

 ఎన్ కౌంటర్ లో  మావోలు  ప్రాణాలు కోల్పోతున్నారు..  హిడ్మాతో  పాటు మావోలు  ఎన్ కౌంటర్ లో  ప్రాణాలు  కోల్పోయారు..  మావోలు   ప్రాణాలు కోల్పోవడం బాద కల్గించింది.. అందుకే  లోంగిపోవాలని కోరుతున్నానంటూ ఆయన పిలుపునిచ్చారు. 

లోంగిపోవాలనుకునే మావోయిస్టులు  తనకు ఫోన్ చేయాలని కోరారు.  లొంగిపోవాలనుకే వారు 8856038533 అనే తన నంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు మల్లోజుల  వేణు గోపాల్  .