జాతీయ జెండాను అవనతం చేస్తుండగా కరెంట్ షాక్

జాతీయ జెండాను అవనతం చేస్తుండగా కరెంట్ షాక్
  • కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో విషాదం

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఉత్సాహంగా ఎగురవేసిన జాతీయ జెండాను సాయంత్రం అవనతం చేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. మృతుడు మాచారెడ్డి  మండల కేంద్రానికి చెందిన మామిడి దేవరాజ్ గా గుర్తించారు. లారీ అసోసియేషన్ ఆఫీస్ వద్ద ఈ ఘటన  చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో కుప్పకూలిన మామిడి దేవరాజ్ ను హుటాహుటిన కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. స్వాతంత్ర దినోత్సవ వేళ జరిగిన ఘటన స్థానికంగా విషాదం రేపింది.