శామీర్‌పేట, వెలుగు: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర ధారుడ్యానికి ఎంతగానో దోహదపడతాయని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని అలియాబాద్, ముడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల్లో యువత కోసం నిర్వహించిన సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది.
అలియాబాద్ గ్రౌండ్‌లో టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ముడుచింతలపల్లి పరిధిలో లింగాపూర్ తండా టీమ్, అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో లాల్‌గడి మలక్‌పేట టీమ్ విజేతగా నిలిచాయి. విన్నర్ టీమ్‌లకు రూ.25 వేల నగదు బహుమతితో పాటు కప్‌ను
అందజేశారు.
