మిర్యాలగూడలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడి పాడె మోసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

మిర్యాలగూడలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడి పాడె మోసిన మంత్రి వివేక్  వెంకటస్వామి

నల్లగొండ జిల్లా  మిర్యాలగూడలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడి రెక్క శౌరి అంత్యక్రియలో పాల్గొన్నారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. శౌరి మృతి చెందారని తెలుసుకున్న మంత్రి.. 2026 మే 17వ తేదీన మిర్యాలగూడ వెళ్లి అంతిమయాత్రలో పాల్గొన్నారు. శౌరి శవపేటికను మోసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత శౌరి కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం చెప్పారు మంత్రి. ఆయన లేని లోటు తీర్చలేనిదని.. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. శౌరి భౌతికంగా లేకపోయినా కుటంబానికి తామంతా అండగా ఉన్నట్లు చెప్పారు. 

కోడిరెక్క శౌరి పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మంత్రి వివేక్. పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారని కొనియాడారు. నేటి తరం నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  మంత్రితో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.