- స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కనకయ్య దంపతులు
కామేపల్లి, వెలుగు : మండలంలోని కొమ్మినేపల్లి గ్రామంలోని పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వ ఏకాదశి రుద్రాభిషేకం తదితర పూజలు చేశారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య లక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ అనురాధాశంకర్, ఉప సర్పంచ్ మల్లికార్జున్ రావు, డీసీసీబీ డైరెక్టర్ మల్లిబాబుయాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మద్దినేని రమేశ్ బాబు, పత్తే హమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
