మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటలో మహిళా సంఘం ఆధ్వర్యంలో, మద్దుట్లలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ జరపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో స్వాతి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మల్లీశ్వరి, సర్పంచ్ శౌర్య, లీడర్లు పాల్గొన్నారు.

