మోడల్ స్కూల్ టీచర్లకు.. 010 పద్దు ద్వారా జీతాలు ఇవ్వాలి

మోడల్ స్కూల్ టీచర్లకు.. 010 పద్దు ద్వారా  జీతాలు ఇవ్వాలి
  • ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పీఎంటీఏ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ కోరారు. బుధవారం వారు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను కలిసి వినతి పత్రం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతినెలా మొదటి తేదీన టీచర్లకు జీతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు ఒకటో తేదీన జీతాలు అందించాలని కోరారు. 

అదేవిధంగా.. మోడల్‌‌ స్కూళ్లలో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్‌‌ టీచర్ల(హెచ్‌‌బీటీ) సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్​బీటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు కోరారు. బుధవారం ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డిని  కలిసి వినతిపత్రం అందించారు.  ప్రస్తుతం పీరియేడ్​కు రూ.182 చెల్లిస్తున్నారని, దీన్ని జూనియర్ కాలేజీల్లో మాదిరిగా రూ.390కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. హెచ్​బీటీలనూ ఎంటీఎస్​ టీచర్లుగా గుర్తించాలని కోరారు.