ఆస్ట్రేలియా ఓపెన్ ఫస్ట్ రౌండ్లోనే మాజీ నెం.1 ఇంటిదారి

ఆస్ట్రేలియా ఓపెన్ ఫస్ట్ రౌండ్లోనే మాజీ నెం.1 ఇంటిదారి

 ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ 20230లో సంచ‌ల‌నం న‌మోదైంది. మాజీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వన్ ప్లేయర్  మ‌గురుజ‌ తొలి రౌండ్‌లోనే ఇంటి బాట పట్టింది.  26వ సీడ్ బెల్జియం  ప్లేయర్ ఎలిసె మెర్టెన్స్ చేతిలో  6-3, 6-7(3-7), 1-6తో మ‌గురుజ పరాజయం చవిచూసింది. 

రెండున్నర గంటల పాటు హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో ఎలిసే పూర్తి ఆధిపత్యం చూపింది. అయితే తొలి సెట్ గెలిచి ఊపుమీదున్న మగురుజ..రెండో సెట్ లో ప్రత్యర్థి జోరుకు నిలవలేకపోయింది. రెండో సెట్ లో పుంజుకున్న ఎలిసే..6-7తో సెట్ ను దక్కించుకుంది. ఇక నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో మగురుజ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఎలిసె 6-1తో సెట్ ను గెలిచి మ్యాచ్ లో విజయం సాధించింది.  స్పెయిన్‌కు చెందిన‌ మ‌గురుజ ఇప్పటి వరకు  గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించింది. 2016లో  ఫ్రెంచ్ ఓపెన్ , 2017లో  వింబుల్డన్ గెలిచింది.  2020లో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ రన్నరప్ గా నిలిచింది.