- ప్రధాన పార్టీలలో రెబల్స్ బెడద
- ఇండిపెండెంట్ అభ్యర్డులకు గుర్తులు కేటాయింపు
- నేటి నుంచి ప్రచారం షురూ
నల్గొండ, వెలుగు: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చివరి రోజు పెద్ద ఎత్తున అభ్యర్డులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఖరారైన అభ్యర్థులకు బీఫామ్స్ అందించగాటికెట్ రాక భంగపడ్డ ఆశవాహులు కొంతమంది నామినేషన్లు ఉపసంహరించుకోగా మరికొంతమంది మాత్రం రెబల్స్ గా పోటీలో నిలిచారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా 13వ తేదీన ఫలితాలు రానున్నాయి.
సూర్యాపేటలో..
సూర్యాపేట మున్సిపాలిటీలో 48వార్డులు ఉండగా 264మంది అభ్యర్డులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 48, బీఆర్ఎస్ 45, బీజేపీ 47, బీఎస్ 3, ఆప్1, సీపీఐ (ఎం) 3, జనసేన10, ఫార్వర్డ్ బ్లాక్ 2, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 27, స్వతంత్ర అభ్యర్దులు78 మంది పోటీ చేస్తున్నారు. నందికొండ మున్సిపాలిటీలో మొత్తం 95 మంది క్యాండిడేట్స్ 79 నామినేషన్స్ వేశారు. వీటిలో 42 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా 37 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి12 మంది, బీఆర్ఎస్ 12 మంది, బీజేపీ నుంచి తొమ్మిది మంది, ఇండిపెండెంట్ గా ముగ్గురు, ఆప్ నుంచి ఒకరు ఎన్నికల బరిలో నిలిచారు.
తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని అధికారులు తెలిపారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ కాగా 15 వార్డుల్లో ఎన్నికల బరిలో 56 మంది నిలిచారు. కాంగ్రెస్ 15, బీఆర్ ఎస్ 15, బీజేపీ 13, సీపీఎం నుంచి 02, ఇండిపెండెంట్ లు 8, జనసేన 3 బరిలో నిలిచారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో12 వార్డులగాను 105 మంది నామినేషన్లు వేయగా, చివరి రోజు 65 మంది నామినేషన్లను విరమించుకున్నారు. 40 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
పదో వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పిల్లి చంద్రకళ ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, 40 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో కాంగ్రెస్ నుంచి 11 మంది, బీఆర్ఎస్ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 8 మంది, ఇండిపెండెంట్లుగా 7 గురు, డీఎస్పీ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఒకరు, టీఆర్ఏపీ నుంచి ఒకరు ఎన్నికల బరిలో నిలిచారు.దేవరకొండ మున్సిపాలిటీ 20 స్థానాలకు గాను 138 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, 63 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా చివరకి 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ 20, బీఎస్పీ2, సీపీఎం 2, కాంగ్రెస్ 19, బీఆర్ఎస్19, సిపిఐ 1, ఐయూఎంఐ 1, జనసేన1, ఇండిపెండెంట్10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులకుగాను మొత్తం 90 మంది నామినేషన్ వేయగా ఇద్దరు నామినేషన్లు స్కూటీనీలో తిరస్కరించారు. మిగిలిన 88 మందిలో 57 నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో 54 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు, నేరేడుచర్లలో 15 వార్డులకు గాను 82 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 28 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోగా 54 మంది బరిలో ఉన్నారు.
హుజూర్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం 238 మంది అభ్యర్థులు 293 నామినేషన్లు వేయగా.. 127 మంది అభ్యర్డులు విత్ డ్రా చేసుకోగా 111 మంది అభ్యర్డులు పోటీలో ఉన్నారు. వీటిలో 03 వ వార్డ్ ఏకగ్రీవం అయింది. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులకు గాను 256 మంది 333 నామినేషన్లు వేశారు. మూడు వార్డులు ఏకగ్రీవం గా ప్రస్తుతం 32 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 32 వార్డులకు గాను ఇండిపెండెంట్లతో సహా 127 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
యాదాద్రి జిల్లాలో 353 మంది పోటీ
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో 104 వార్డులుండగా.. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 353 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో చౌటుప్పల్లోని 17 వార్డు, యాదగిరిగుట్టలోని 10వ వార్డులో నామినేషన్లు వేసిన వారు విత్ డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులుఇద్దరు ఏకగ్రీవమయ్యారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్తో పొత్తుకుదుర్చుకున్న సీపీఎం, సీపీఐ బరిలో ఉన్నాయి.
మున్సిపాలిటీల వారీగా పోటీ
ఆలేరులో 12 వార్డులున్నాయి. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి అన్ని వార్డుల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సీపీఎం, బీఎస్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఒక్కొక్కరు, ఇండిపెండెంట్గా ఒకరు పోటీ చేస్తున్నారు. మొత్తంగా 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భువనగిరిలో 35 వార్డులున్నాయి. కాంగ్రెస్ నుంచి 34 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీ 31, బీఆర్ఎస్ 30, బీఎస్పీ 3, ఎంఐఎం 2, జనసేన ఒక్కటి, ఇండిపెండెంట్లు 26 మంది పోటీ చేస్తున్నారు. మొత్తంగా 128 మంది పోటీ చేస్తున్నారు. చౌటుప్పల్లో ఏకగ్రీవమైన వార్డు పోగా 19 వార్డులున్నాయి. కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 14, బీజేపీ 14, సీపీఎం 4, జనసేన ఒకటి, రిజిస్ట్రర్డ్ పార్టీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ఐదుగురు పోటీ చేస్తున్నారు. మొత్తంగా 58 మంది పోటీ చేస్తున్నారు.
మోత్కూర్లో 12 వార్డులున్నాయి. బీజేపీ 12, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 11 వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. సీపీఐ, సీపీఎం, రిజిస్ట్రర్డ్ పార్టీ నుంచి ఒక్కరు, ఇండిపెండెంట్లు 12 మంది పోటీ చేస్తుననారు. మొత్తంగా 49 మంది పోటీలో ఉన్నారు. భూదాన్ పోచంపల్లిలో 13 వార్డులున్నాయి. బీజేపీ 11, కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 13, సీపీఎం ఒక్కటి, ఇండిపెండెంట్లు ఇద్దరు పోటీ చేస్తున్నారు. మొత్తంగా 40 మంది పోటీ చేస్తున్నారు. యాదగిరిగుట్టలో 12 వార్డులు ఉండగా ఒక్కటి ఏకగ్రీవమైంది. బీజేపీ 11, కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 10, సీపీఐ, బీఎస్పీ ఒక్కొక్కటి, జనసేన మూడు, ఇండిపెండెంట్లు ఇద్దరు పోటీ చేస్తున్నారు. మొత్తంగా 38 మంది పోటీలో ఉన్నారు.
తేలిన అభ్యర్థుల లెక్క
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ బరిలో మొత్తం 221 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు గత నెల 30న నామినేషన్లు స్వీకరించగా మొత్తం 521 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో మొత్తం 101 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకున్న వారిలో బీజేపీ18, సీపీఎం 1, కాంగ్రెస్ 21, ఎంఐఎం 2, బీఆర్ఎస్ 22, జనసేన 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 31, గుర్తింపు పొందిన పార్టీల నుంచి మరో 4 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 48 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో బీఎస్పీ 2, బీజేపీ 45, సీపీఎం 1, కాంగ్రెస్ 48, ఎంఐఎం 8, బీఆర్ఎస్ 47, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 11, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 9, ఇండిపెండెంట్ అభ్యర్థులు 41 మంది పోటీలో నిలిచారు.
