యువకుల న్యూసెన్స్.. ప్రశ్నించిన ఫ్యామిలీపై దాడి

V6 Velugu Posted on Jul 12, 2021

హైదరాబాద్ : అర్ధరాత్రి ఇంటి ముందు కూర్చొని ఎందుకు లొల్లి చేస్తున్నారని ప్రశ్నించినందుకు.. 20 మంది గ్యాంగ్ కలిసి ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన సంఘటన.. పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బార్కాస్ ప్రాంతానికి చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఇంటి ముందు.. పొరుగిళ్ల యువకులు అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్నారు. దీంతో వారిని వెళ్లిపోవాలని సూచించాడు సల్మాన్. రెచ్చిపోయిన జిలానీ అండ్ గ్యాంగ్... కత్తులు, కర్రలతో దాడికి పాల్పడింది. ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు గ్రూపులు  ఫిర్యాదు చేయడంతో 16 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

Tagged Hyderabad, attack, YOUTH, family, Midnight, , New Sense

Latest Videos

Subscribe Now

More News