క్రికెట్ ఆడుతూ.. పిచ్ పైనే చనిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి

క్రికెట్ ఆడుతూ.. పిచ్ పైనే చనిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి

క్రికెట్ లో వరుస మృతులు కలవరాన్ని సృష్టిస్తున్నాయి. రెండు రోజుల క్రితం బంతి తగిలి 52 ఏళ్ళ జయేష్ సవాలా మరణించగా.. తాజాగా నోయిడాకు చెందిన వికాస్ నేగి అనే ఓ ఇంజినీర్‌ క్రికెట్‌ ఆడుతూ పిచ్‌ మధ్యలో కుప్పకూలి మృతి చెందాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న వికాస్ నేగి సింగిల్ తీస్తూ అవతలి ఎండ్ కు పరిగెత్తుతూ మధ్యలోనే ఊహించని విధంగా ప్రాణాలు విడిచాడు.  

రెండు జట్ల ఆటగాళ్లు అతనికి సహాయం చేయడానికి త్వరగా వచ్చారు. అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వచ్చేలోగా అతను మరణించినట్లు నివేదిక తెలిపింది. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపగా.. ఇంజనీర్ గుండెపోటుతో మరణించాడని తేలింది. ప్రాథమిక నివేదిక ప్రకారం.. నేగి కోవిడ్-19తో బాధపడ్డాడు. అయితే సంఘటన జరిగినప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. నేగీ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో క్రికెట్ ఆడేవారు.

ఇటీవలి కాలంలో యువకులలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా, గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కారణం. గత ఐదేళ్లుగా భారతదేశంలో ఈ సమస్య అధికంగా ఉంది.