ఇప్పుడే వీడు : ఓల్డ్ సిటీ మర్డర్ కేసులో.. ఓ పిల్లోడు అరెస్ట్

ఇప్పుడే వీడు :  ఓల్డ్ సిటీ మర్డర్ కేసులో.. ఓ పిల్లోడు అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో డిసెంబర్ 19న  ఈడీ బజార్ లో జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఘటనా స్థలంలో సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ హత్య కేసులో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు తేలింది. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు తారీఖ్ అలీ (39) ని కత్తులతో దాడి చేసి చంపి, సాక్ష్యాలు దొరక్కుండా వారి దుస్తులను తగలబెట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. 

వ్యక్తిగత కక్షల కారణంగా మహ్మద్ తారీఖ్ అలీ హత్య కేసులో డిసెంబర్ 22( శుక్రవారం) సంతోష్ నగర్, ఐఎస్ సదన్ పోలీసులు మైనర్ బాలుడితో సహా 8మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహ్మద్ మజూరా అలియాస్ చోటూ(24), షేక్ ముజమ్మిల్ అలియాస్ షేక్ ముబీన్ (21) కలీమ్ ఖాన్ (23), మహ్మద్ అఫ్రోజ్ సిద్ధిఖీ(30), ఖలీద్ ఉస్మాన్ అన్సారీ(21), మహ్మద్ అమీర్(20), అబ్దుల్ అమెర్ (23) గా గుర్తించారు. నిందితులు మొత్తం సంతోష్ నగర్ వాసులుగా గుర్తించారు. వీరి నుంచి నాలుగు కత్తులు, 3 యాక్టివాలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

నిందితులు మహ్మద్ మజార్ పీడీఎస్ బియ్యం  ప్రజలనుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముతుంటాడు. ముజామిల్, కలీమ్, అఫ్రోజ్, ఉస్మాన్, అమెర్ లతో కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాడు. మజార్ ముజామిల్, కలీమ్, అఫ్రోజ్ కలిసి కర్మన్ ఘాట్ లోని ఓ బార్ మద్యం సేవిస్తుండగా.. అక్కడికి వచ్చిన అరిఫ్ తో గొడవ జరిగింది. మజార్ మద్యం మత్తులో అరిఫ్ పై బాటిల్ తో కొట్టి గాయపర్చాడు. వీరి మధ్య  సమస్యను పరిష్కరించేందుకు మృతుడు తారిఖ్ జోక్యం చేసుకున్నాడు. 

మజార్.. అరిఫ్ కు రూ. 2 లక్షలు ఇస్తే సమస్యను పరిష్కారం అవుతుందని చెప్పారు. ఒప్పందం ప్రకారం మజార్  రూ. 2 లక్షలు తెచ్చి తారిఖ్ కు ఇచ్చాడు. అయితే ఆ డబ్బును అరిఫ్ కు తారిక్ ఇవ్వలేదు.. దీంతో మజార్ అతడిని నిలదీశాడు..దీంతో ఆగ్రహించిన తారిఖ్ .. నీ అక్రమ పీడీఎఫ్ బియ్యం దందా గురించి పోలీసులకు చెపుతానని మజార్ ను బెదిరించారు. పథకం ప్రకారం స్నేహితులతో కలిసి తారిఖ్ ను అంతమొందించేందుకు ప్లాన్ వేశాడు మజార్.

డిసెంబర్ 19న మజార్ తన స్నేహితులతో కలిసి తారిఖ్ ను ఈడీ బాజర్ లో కత్తలతో ఎటాక్ చేసి హత్య చేశాడు. సాక్ష్యాలు దొరక్కుండా వారి దుస్తులను కాల్చివేశారు. డిసెంబర్ 21 న నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తారీఖ్ ను తామే చంపినట్లు ఒప్పుకున్నారు.