పాల్వంచ, వెలుగు : ఫు ట్ బాల్ క్రీడపై యువతలో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతుందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లా ఫుట్ బాల్ క్లబ్ ఆధ్వ ర్యంలో శనివారం పాల్వంచలోని విద్యుత్ కళాభారతి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాల్వంచ నుంచి ఫుట్ బాల్ క్రీడాకారులు ఎక్కువ మంది ఉండడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజినీర్ సూర్యనారాయణ, ఎస్ఈ యుగపతి, డీఈ వేణుగో పాల్, జిల్లా క్రీడల అధికారి పరందామరెడ్డి, ఫుట్ బాల్ కప్ వ్యవస్థాపకుడు సుధాకర్ రాజు, సీనియర్ ఫుట్ బాల్ క్రీడాకారుడు ఎండీ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
