
దేశ విభజనతో కలిగిన బాధలను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. లక్షలాది మంది మన సోదర సోదరీమణులు చెల్లాచెదురయ్యారని, మతిలేని ద్వేషం, హింసతో వేలాది మంది చనిపోయారని చెప్పారు. వారి కష్టాలు, త్యాగాలకు గుర్తుకు ఆగస్టు 14న విభజన భయానక స్మృతి దినంగా పాటించనున్నట్లు తెలిపారు. దేశ విభజనతో ప్రజల్లో సామాజిక విద్వేషాలు వచ్చాయని, సామరస్యం లోపించిందన్నారు మోడీ. ఆ విష బీజాలను పోగెట్టేందుకు ఆగస్ట్ 14న పార్టిషన్ హారర్స్ రిమెంబ్రెన్స్ డే నిర్వహించుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ స్మృతి దినం సామాజిక అసమానతలు తొలగించి, ఏకత్వ స్పూర్తిని నింపాలన్నారు. సామాజిక సామరస్యం, మానవ సాధికారత మరింత బలోపేతం కావాలని ఆకాక్షిస్తూ ట్వీట్ చేశారు మోడీ.