మావోయిస్టు అగ్రనేత సతీమణి అరెస్ట్?

మావోయిస్టు అగ్రనేత  సతీమణి అరెస్ట్?
  • పోలీసుల అదుపులో కల్పన, మరో ముగ్గురు!
  • ఆమె స్వస్థలం  నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు దివంగత మల్లోజుల కోటేశ్వర్ రావు సతీమణి కల్పన ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  కల్పన అలియాస్ సుజాత అలియాస్ మైనక్క సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.  ఆమె మరో ముగ్గురు మావోయిస్టులు సభ్యులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.  

పోలీసులు అరెస్టును ఇవాళ సాయంత్రం ధ్రువీకరిస్తారని సమాచారం. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరుకు చెందిన కల్పన 1983లో ఆర్ఎస్‌యూ లో పని చేస్తూనే మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. లాల్‌గఢ్ ఉద్యమ నేత సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు బెంగాల్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మల్లోజుల కోటేశ్వర రావును వివాహం చేసుకున్నారు.  చాలా కాలంపాటు దండకారణ్యంలో పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌ తో జనతన సర్కార్ల ఏర్పాటులో ఆమె కీలక భూమిక పోషించినట్టు సమాచారం.