భైంసాలో మరోసారి అల్లర్లు.. 144 సెక్షన్

భైంసాలో మరోసారి అల్లర్లు.. 144  సెక్షన్

నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు పలుచోట్ల కర్ఫ్యూ.. మరికొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 6 వందల మంది పోలీసులు, 50 మంది ఉన్నతాధికారులతో పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఘర్షణకు కారణమైన వంద మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ, నిర్మల్ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ ఆదివారం రాత్రి భైంసా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం రాత్రి 9 గంటలకు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు ఎస్పీ విష్ణు వారియర్. కొన్ని వాహనాలు.. షాప్స్ ను తగలబెట్టారని అన్నారు. నిర్మల్, ఆదిలాబాద్, పొరుగు జిల్లాలనుంచి పెద్దఎత్తున ఫోర్స్ రప్పించామన్నారు. ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. శాంతి స్థాపనకు ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిందితులకు శిక్షలు పడేలా చూస్తామన్నారు ఎస్పీ.