
నవదీప్(Navadeep) తో మొదటి సినిమా అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది నటి పూనమ్ బజ్వా( Poonam Bajwa). తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించింది. అయితే, ఆ మధ్య కాస్త బరువు పెరగడంతో ఈ హీరోయిన్‌కు చాన్స్‌లు తగ్గాయి. ప్రస్తుతం తమిళంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బిజీగా మారింది.
తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు మగాళ్లు చాలా తీయని మాటలు చెప్తారు. ఏదో ఒకరోజు కాఫీకి రమ్మని పిలుస్తారు. ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే ఆ పిలుపులో బయటకు కనిపించని ఎన్నో డబుల్ మీనింగ్ అర్థాలుంటాయి. జాగ్రత్తగా ఉండండి అంటూ పూనమ్ ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాఫీకి పిలవడం అంత క్రైమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ మీరెన్నిసార్లు కాఫీకి వెళ్లారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.