మూడు కార్పొరేషన్లతో పాటు హైడ్రాలో నేటి ప్రజావాణి రద్దు

మూడు కార్పొరేషన్లతో పాటు  హైడ్రాలో నేటి  ప్రజావాణి రద్దు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పండుగ నేపథ్యంలో సోమవారం జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలతో పాటు హైడ్రా ఆఫీసులో నిర్వహించే ప్రజావాణిలను రద్దు చేశారు. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతిపత్రాల సమర్పణకు ఇబ్బంది పడకుండా ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తదుపరి ప్రజావాణి అక్టోబర్‌‌ 26న యథావిధిగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.