ఈ గేదె ఏంట్రా బాబూ అచ్చం ట్రంప్ లాగే ఉంది.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు.. ఆ ఫ్యామిలీ ఫేమస్ అయిపోయిందిగా

ఈ గేదె ఏంట్రా బాబూ అచ్చం ట్రంప్ లాగే ఉంది.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు.. ఆ ఫ్యామిలీ ఫేమస్ అయిపోయిందిగా

కొన్నిసార్లు జంతువుల రూపురేఖలు మనుషులను పోలినట్లు ఉంటుంటాయి. అలాంటప్పుడు ఆ మనిషికి ఆ జంతువు పేరు పెట్టడం.. హేళన చేయడం చూస్తూనే ఉంటాం. కానీ ఒక ప్రసిడెంట్ ను పోలిన గేదె ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ న్యూస్ ట్రెండ్ అవుతోంది. బంగ్లాదేశ్ లో ఒక బర్రె అచ్చం ట్రంప్ లాగే ఉందనే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అవును బంగ్లాదేశ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేరిట గేదెలున్నాయి. పేర్ల వరకే కాదు వాటి రూపు రేఖలు కూడా అలాగే ఉన్నాయని.. వీడియో వైరల్ గా మారింది. దీంతో సెల్ఫీల కోసం ఆ గ్రామానికి జనాలు క్యూ కట్టారు. ట్రంప్ ను చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో ఈ గేదెలు అనుకోకుండా సెలబ్రిటీలు అయిపోయాయి. ఆ ఫ్యామిలీ ఫుల్ ఫేమస్ అయిపోయింది. 

బంగ్లాదేశ్ లోని నారాయణ్ గంజ్ ఏరియాలోని పైక్పారా ప్రాంతంలో డొనాల్డ్ ట్రంప్ అనే గేదె ఉంది. 700 కిలోలు ఉన్న ఈ గేదె వీడియోలో చూపినట్లుగా.. గేదె తలపై ఉన్న బంగారు రండులో ఉన్న జుట్టు.. అచ్చం ట్రంప్ జుట్టులాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ గేదెను రాజ్షాహి లోని పశువుల సంతలో 10 నెలల క్రితం కొన్నట్లు జియాఉద్దిన్ మ్రిధా తెలిపాడు. 

గేదె తల చూశాక అచ్చం ట్రంప్ లాగే ఉందని జోక్ చేశాడట వాళ్ల తమ్ముడు. ట్రంప్ అనే పేరుపెట్టాడట. ఆ బర్రెను కూడా అప్పటికే అమ్మినట్లు చెప్పాడు. అయితే ట్రంప్ పేరు పెట్టడంపై స్వయంగా వెళ్లి చూసినవాళ్లు కూడా నిజమే అంటున్నారు. మొదట ఏదో జోక్ చేస్తున్నారని అనుకున్నాం.. కానీ దగ్గరకెళ్లి చూస్తే నిజంగా.. దాని హెయిర్ స్టైల్ ట్రంప్ లాగే ఉందని పోటస్ట్ చేస్తున్నారు. అయితే దానికి ట్రంప్ లాగా ఆవేశం లేదని.. చాలా సైలెంట్ గా, ప్రశాంతంగా ఉంటుందని చూసినవాళ్లు చెబుతున్నారు. 

  • నెతన్యాహు:

అదే విధంగా 750 కిలోలున్న మరో గేదె కూడా వైరల్ గా మారింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేరున ఉన్న ఈ గేదె.. చాలా బలంగా, అగ్రెసివ్ గా ఉంటుందట. గట్టగి లెంకలు వేయడం, అరవటం చూసి నెతన్యాహు లాగే ప్రవర్తిస్తోందని ఆ పేరు పెట్టినట్లు చెబుతున్నారు.