ఆగని వానలు: 5 జిల్లాలకు రెడ్‌ అలర్ట్

ఆగని వానలు: 5 జిల్లాలకు రెడ్‌ అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులు భారీగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలతో వాంగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులతో పాటు ప్రాజెక్టులు కూడా మత్తడి దూకుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 9 జిల్లాలకు ఆరెంజ్‌, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు.అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెల్లాలని తెలిపారు.