వికారాబాద్ జిల్లాలో వైన్స్ షాపులకు రిజర్వేషన్లు ఖరారు

వికారాబాద్ జిల్లాలో వైన్స్ షాపులకు రిజర్వేషన్లు ఖరారు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​జిల్లాలో 2025–27 సంవత్సరానికి సంబంధించి కొత్త వైన్స్​షాపులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. గురువారం కలెక్టర్​ ప్రతీక్ జైన్​వీడియో కాన్ఫరెన్స్​ద్వారా అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టారు. జిల్లాలో 59 మద్యం దుకాణాలకు గానూ 42 ఓపెన్​ కేటగిరీ, ఎస్సీలకు 9, ఎస్టీలకు 2, గౌడ్స్‎కు 6 షాపులను  కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ.3 లక్షలు డీడీ చలాన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్​ సూచించారు. 

ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18  వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. లాటరీ ద్వారా  వచ్చే నెల 23-న జిల్లా కలెక్టరేట్​లో షాపులను కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్ లింగ్యానాయక్, ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ విజయ భాస్కర్, డీటీడీవో కమలాకర్ రెడ్డి, డీసీ వెల్ఫేర్ అధికారి మాధవరెడ్డి పాల్గొన్నారు.

మేడ్చల్  మల్కాజిగిరి జిల్లాలో..

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్ కు సంబంధించి 118 దుకాణాలకు గాను 101 దుకాణాలను ఓపెన్ కేటగిరీకి కేటాయించారు. 11 గౌడ్స్​కు, 5 ఎస్సీలకు, 1 ఎస్టీలకు రిజర్వేషన్​ కేటాయించారు. మల్కాజిగిరి యూనిట్ కు సంబంధించి 88 షాపులుండగా 68 ఓపెన్ కేటగిరీ, 12 గౌడ్స్​కు, 7 ఎస్సీలకు, 1 ఎస్టీలకు కేటాయించారు.