మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుంకుంట రాజీవ్ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కారును బలంగా ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యంగా, అతివేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో... ఒక్కసారిగా అదుపుతప్పిన కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సమాచారం. వీరంతా మల్కాజిగిరి నుంచి శామీర్ పేట వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
