V6 News

ఫ్యూచర్ సిటీకి ఫ్రీ బస్సులు

ఫ్యూచర్ సిటీకి ఫ్రీ బస్సులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వం ఇటీవల ఘనంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీ సందర్శనకు ఆర్టీసీ ఫ్రీ బస్సులు నడుపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 13 వరకు ఉచిత బస్సులు నడుస్తాయని ఈడీ ఎం.రాజశేఖర్ తెలిపారు. 

ఎంజీబీఎస్, జేబీఎస్, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, ఉప్పల్, శంషాబాద్ నుంచి ఉదయం 9, 10, 11, 12 గంటలకు ఈ బస్సులు ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి తిరిగి సాయంత్రం 4, 5, 6, 7 గంటలకు బస్సులు బయలుదేరతాయన్నారు. ప్రయాణికులు ఈ ఉచిత సేవను వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు 9959226160కు సంప్రదించాలని సూచించారు.