మహిళా సంఘాలకు మార్కెటింగ్ పై అవగాహన.. ఎంఎంసీ తరపున సహకారం అందిస్తాం

మహిళా సంఘాలకు మార్కెటింగ్ పై అవగాహన.. ఎంఎంసీ తరపున సహకారం అందిస్తాం

హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్​కార్పొరేషన్​ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్​పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యాప్తంగా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రాంతాల్లో నిర్వహించిన అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న కార్యక్రమాల్లో 58 మంది మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? నాణ్యమైన ఉత్పత్తులను ఎలా తయారు చేయాలి? ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ విధానాలపై అర్బన్​కమ్యూనిటీ డెవలప్​మెంట్​విభాగం అధికారులు వివరించారు. స్థానికంగా తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ఇంట్లో వినియోగించే వస్తువులను మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకెళ్లే మార్గాలపై సూచనలు అందించారు. మహిళల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఎంఎంసీ తరపున అవసరమైన సహకారం అందిస్తామని  కమిషనర్ వినయ్ క్రిష్ణా రెడ్డి తెలిపారు.