- శంషాబాద్ ఎయిర్‌పోర్టులోరూ.4.5 కోట్ల సరుకు సీజ్
- ఇద్దరు అరెస్ట్
గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. మంగళవారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా, 22 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లు బయటపడ్డాయి.
వీటిలో13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 4.5 కోట్లు ఉంటుందని అంచనా. సదరు వ్యక్తికి ప్రయాణ ఏర్పాట్లు చేసిన మరో వ్యక్తిని కూడా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 160 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేసి, 30 మంది నిందితులను అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
