ఇంట్లో అగ్ని ప్రమాదం.. గృహోపకరణాలు దగ్ధం

ఇంట్లో అగ్ని ప్రమాదం.. గృహోపకరణాలు దగ్ధం

మలక్ పేట, వెలుగు: సైదాబాద్ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారంతో మలక్ పేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

ప్రమాద సమయంలో ఇంట్లో చిక్కుకున్న ఓ మహిళ, చిన్నారిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, ఇంట్లోని పలు గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.