- నేటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరణ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. మంగళవారం ఉదయం నిర్వహించిన అష్టోత్తర శతఘటాభిషేకంతో గత వారం రోజులుగా జరుగుతున్న ఉత్సవాలకు ఆలయ అర్చకులు పరిసమాప్తి పలికారు. జనవరి 28న స్వస్తివాచనం, పుణ్యాహవచనంతో మొదలైన బ్రహ్మోత్సవాలు మంగళవారం చేపట్టిన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి.
ఉత్సవాల ముగింపులో భాగంగా 108 కలశాలను వరుస క్రమంలో పేర్చి, అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు రఘు సిబ్బంది పాల్గొన్నారు.
