- భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో కలకలం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇంటర్ ఎగ్జామ్ రాస్తుండగా ఓ స్టూడెంట్‌కు గర్భస్రావమైన ఘటన కలకలం సృష్టించింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన ఇంటర్ ఒకేషనల్ స్టూడెంట్ పట్టణంలోని కేజీబీవీలో శుక్రవారం ఎగ్జామ్‌కు అటెండ్ అయింది. ఎగ్జామ్ రాస్తూ ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకొని వాష్‌రూంకు వెళ్లింది. ఆ స్టూడెంట్ ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి, స్వీపర్‌ను వాష్‌రూమ్ వద్దకు పంపించారు. తనకు పీరియడ్స్ వచ్చాయని ఆ స్టూడెంట్ చెప్పడంతో కాలేజీ నుంచి ఆమెకు అవసరమైన ప్యాడ్స్, న్యాప్కిన్స్ తెప్పించి ఇచ్చారు. అనంతరం ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాసేందుకు రూంలోకి వెళ్లగా, అదే టైంలో వాష్‌రూం క్లీన్ చేస్తుండగా పిండం కనిపించడంతో స్వీపర్ ఆందోళనకు గురయ్యారు.
గర్భస్రావం జరిగినట్లుగా గుర్తించి, విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎగ్జామ్ అనంతరం ఆ స్టూడెంట్ను ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రెగ్నెంట్ అయిన స్టూడెంట్ మాత్రలు వేసుకోవడంతో నెలలు నిండక ముందే గర్భస్రావం జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
