ప్రభాస్ డైరెక్టర్ తో సుడిగాలి సుదీర్ క్రేజీ ప్రాజెక్ట్

ప్రభాస్ డైరెక్టర్ తో సుడిగాలి సుదీర్ క్రేజీ ప్రాజెక్ట్

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి(Sudigali sudher) సుదీర్ తన తరువాత సినిమా కోసం ఏకంగా ప్రభాస్ డైరెక్టర్ ని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరా అనుకుంటున్నారా.? అతను మరెవరో కాదు.. ప్రభాస్ కి మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి మెమరబుల్ మూవీ ఇచ్చిన దశరధ్(Dasharash).

అవును.. దర్శకుడు దశరధ్ తన తరువాత మూవీని సుధీర్ తో ప్లాన్ చేస్తున్నాడట. నిజానికి దశరధ్ కి చాలా కాలంగా సరైన హిట్ లేదు. చివరగా ఈ దర్శకుడు మంచు మనోజ్(Manchu manoj) హీరోగా "శౌర్య" మూవీని తెరకెక్కించాడు. 2016లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో.. చాలా కాలం తరువాత దశరధ్ తన కంబ్యాక్ కోసం సుధీర్ తో జతకడుతున్నాడు. ఇక సుధీర్ విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన గత చిత్రం గాలోడు(Galodu) బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ నిర్మాతకి భారీ లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా. హీరోగా సుధీర్ మార్కెట్ ని పెంచేసింది. దశరధ్ కూడా సుధీర్ ప్రెసెంట్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఒక సింపుల్ అండ్ కామెడీ కథని సిద్ధం చేసాడట. దీనికి సుధీర్ అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట. కథ వినగానే సుధీర్ కూడా వెంటనే ఓకే చెప్పేశాడట. వెచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారట మేకర్స్.