సున్నం చెరువులో హైడ్రా రీసర్వే

సున్నం చెరువులో హైడ్రా రీసర్వే

మాదాపూర్​, వెలుగు: సున్నం చెరువులో హైడ్రా అధికారులు మరోసారి సర్వే చేపట్టారు. మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్​అధికారులతో కలిసి గుట్టల బేగంపేట గ్రామ పరిధిలో 12, 12ఏ, 13 సర్వేనంబర్లలో, అల్లాపూర్​ పరిధిలో 30, 31 సర్వే నంబర్లలో ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్ల విస్తీర్ణంపై సర్వే చేశారు.

 ఇటీవల సున్నం చెరువులో గుడిసెలు, షెడ్లను కూల్చిన క్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాంధీ అడ్డుకున్నాడు. ముందుగా ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లను నిర్ధారించాలని డిమాండ్​  చేశారు. దీంతో  హైడ్రా మరోసారి సర్వే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైడ్రా డీఈలు జగదీశ్వర్​, శ్రీనివాస్​చారి, రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారులు పాల్గొన్నారు.