V6 News

ఫోర్జరీ సంతకాలతో మా భూమిని కబ్జా చేసిండు

ఫోర్జరీ సంతకాలతో మా భూమిని కబ్జా చేసిండు
  • ఎస్వీ రంగారావు మనవడు రంగారావు
  • న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: తన తాత ఎస్వీ రంగారావు కొనుగోలు చేసిన ఇంటిని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని మనవడు రంగారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో అడ్వకేట్ అంజన్ గౌడ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్ లో 1966లో 446 చదరపు అడుగుల స్థలాన్ని తమ తాత ఎస్వీ రంగారావు కొనుగోలు చేసి ఇంటిని నిర్మించారని చెప్పారు. ఆ ఇంటిని 1995లో శ్రీనివాస్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామన్నారు. 

అతడు నమ్మకంగా ఉన్నట్టు నటించి 2007లో తమ సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. మున్సిపల్ ట్యాక్స్ చెల్లించేందుకు వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసిందన్నారు. కోర్టులో విచారణ నడుస్తుండగానే ఇంటిని కూల్చి నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. పోలీసులంతా శ్రీనివాస్​కు మద్దతు పలుకుతున్నారని, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.