టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు 20 వరకు పెంపు

టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు  20 వరకు పెంపు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్  పబ్లిక్  పరీక్షల ఎగ్జామ్  ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. ఎలాంటి ఫైన్  లేకుండా ఈ నెల 20 వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆ విభాగం డైరెక్టర్  పీవీ శ్రీహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ముందుగా ఇచ్చిన షెడ్యూల్  ప్రకారం ఈ నెల 13తోనే గడువు ముగిసింది. వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించామని డైరెక్టర్  వెల్లడించారు. కాగా.. రూ.50 ఫైన్ తో ఈ నెల 29 వరకు, రూ.200 ఫైన్ తో డిసెంబర్ 2 నుంచి 11 వరకు, రూ.500 జరిమానాతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని శ్రీహరి వివరించారు. ఇక రెగ్యులర్  స్టూడెంట్లకు రూ.125 మాత్రమే ఎగ్జామ్ ఫీజు ఉందని వెల్లడించారు.