
- ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ శాఖ (టీజీఎన్‌పీడీసీఎల్)లో 339 కొత్త ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.339 పోస్టుల్లో చీఫ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్, డివిజనల్ ఇంజనీర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లైన్‌మన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ కొత్త ఉద్యోగాల క్రియేషన్ కంటే ముందు..మొత్తం 433 ఉపయోగంలో లేని పోస్టులను రద్దు చేశారు. వాటి స్థానంలో 339 కొత్త పోస్టులను క్రియేట్ చేసి భర్తీకి ఆమోదం తెలిపారు.
ఖాళీల వివరాలు..చీఫ్ ఇంజనీర్ (1), చీఫ్ జనరల్ మేనేజర్ (1), జాయింట్ సెక్రటరీ (1), సూపరింటెండెంట్ (4), జనరల్ మేనేజర్ (1), డివిజనల్ ఇంజనీర్ (4), సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (4), అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (6), అసిస్టెంట్ ఇంజనీర్ (16), సబ్-ఇంజనీర్ (10), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (40), సీనియర్ అసిస్టెంట్ (88), సీనియర్ లైన్ ఇన్ స్పెక్టర్ (32), అసిస్టెంట్ లైన్‌మన్ (48), ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ (60), వాచ్‌మన్ (4)పోస్టులు ఉన్నాయి. వీటికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.