V6 News

రూ.14 వేల కోట్ల టారిఫ్  సబ్సిడీకి సర్కారు ఆమోదం

రూ.14 వేల కోట్ల టారిఫ్  సబ్సిడీకి సర్కారు ఆమోదం
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యుత్​శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ 

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు 2026–27 ఆర్థిక సంవ త్సరానికి అందించే రూ.14 వేల కోట్ల టారిఫ్​ సబ్సిడీకి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ట్రాన్స్​కో సంస్థకు చెల్లింపులు జరిగేలా విద్యుత్​శాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ నవీన్ మిట్టల్​ఉత్తర్వులు జారీ చేశారు. మూడు వేర్వేరు హెడ్ ఆఫ్​ అకౌంట్లకు ఏప్రిల్ నుంచి ప్రతి నెలా రూ.1,166.67 కోట్లు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులన్నీ కూడా ‘టీజీ పవర్ డిస్ట్రిబ్యూ కంపెనీస్​ పూల్’​ అకౌంట్​లో జమ చేయబడతాయని తెలిపారు.

  నెలవారి పరిమితులు, త్రైమాసిక పాటిస్తూ ఈ నిధులను ఖర్చు చేసి యుటిలైజేషన్​ సర్టిఫికెట్లు (యూసీ) విధిగా సమర్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. విద్యుత్​పంపిణీ సంస్థల(డిస్కమ్​)పై భారం పడుకుండా వ్యవసాయానికి ఉచిత కరెంట్​సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా ఈ సబ్సిడీ నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.