- గురునానక్ కాలేజీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మేనేజ్మెంట్ కోటా కింద ఇచ్చిన అడ్మిషన్‌ను నీట్ మార్కుల ఆధారంగా రద్దు చేస్తే విద్యార్థి చెల్లించిన ఫీజును కాలేజీ వద్ద ఉంచుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. అడ్మిషన్ రద్దయినప్పుడు విద్యార్థికి ఫీజు తిరిగి ఇవ్వాల్సిందేనని పేర్కొంది.
నగరంలోని గురునానక్ హోమియోపతి మెడికల్ కాలేజీలో గత ఏడాది అక్టోబర్ 27న ఇచ్చిన అడ్మిషన్‌ను జనవరి 3న రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన డి. శబరిప్రియ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.. విద్యార్థి చెల్లించిన రూ.3.32 లక్షలను ఆరు వారాల్లో తిరిగి ఇవ్వాలని కాలేజీని ఆదేశించారు.
