జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన

జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన

జైనూర్, వెలుగు: జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించవచ్చని టీయూడబ్ల్యూజే (-ఐజేయూ) ఆసిఫాబాద్​ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. సోమవారం జైనూర్‌‌‌‌‌‌‌‌లో జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల జర్నలిస్టులతో సమావేశం నిర్వహించి, జిల్లా 3వ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు.

జర్నలిస్టు ఆత్రం తుకారాం మృతికి మౌనం పాటించి నివాళులర్పించారు. ఇండ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా కుమ్రం భీం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చీఫ్ అడ్వైజర్లుగా అబ్దుల్ రహమాన్, సంపత్ కుమార్, ప్రకాశ్ గౌడ్, కన్వీనర్‌‌‌‌‌‌‌‌గా ఆత్రం ఆనంద్ రావు, కో కన్వీనర్లుగా పి.నరేందర్, షేక్ జమీల్‌‌‌‌‌‌‌‌ను ఎన్నుకున్నారు. అక్టోబర్ 7న ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఏజే ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో టీయూడబ్ల్యూజే జిల్లా 3వ మహాసభకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రహమాన్ పిలుపునిచ్చారు.