విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ మూవీ నుంచి.. జరీనా వాహబ్ క్యారెక్టర్ గ్లిమ్ప్స్ రిలీజ్...

విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ మూవీ నుంచి.. జరీనా వాహబ్ క్యారెక్టర్ గ్లిమ్ప్స్ రిలీజ్...

విజయ్ సేతుపతి లీడ్ రోల్‌‌లో పూరి జగన్నాథ్‌‌  రూపొందిస్తున్న  చిత్రం ‘స్లమ్ డాగ్’. 33 టెంపుల్ రోడ్ అనేది క్యాప్షన్.  టబు, సంయుక్త, దునియా విజయ్, జరీనా వహాబ్  కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేస్తున్న మేకర్స్.. తాజాగా జరీనా వహాబ్ క్యారెక్టర్‌‌‌‌ను గ్లింప్స్ ద్వారా  రివీల్ చేశారు.   ఇందులో విజయ్ సేతుపతి అమ్మ జుబైదాగా జరీనా వహాబ్ కనిపించారు. తన జీవితంలో ఎదురైన అత్యంత బాధాకరమైన సంఘటనను జుబైదా గుర్తుచేసుకునే ఎమోషనల్ ఎపిసోడ్‌‌ను ఈ గ్లింప్స్‌‌లో చూపించారు. ‘

‘ఈ ఆకలి ముందు అన్నీ ఓడిపోతాయిరా.. ఆకలితో ప్రాణాలు తోడేస్తూ ఉంటే.. నాకు తెలియకుండానే చేతులు అడుక్కోవడం మొదలుపెట్టేశాయి” అంటూ ఆమె చెప్పే డైలాగ్ హార్ట్ టచింగ్‌‌గా ఉంది.   ‘అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..’ అని గ్లింప్స్‌‌ చివరిలో పూరి జగన్నాథ్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  

పూరీ కనెక్ట్స్ బ్యానర్‌‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రొల్ల ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.   బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర పాత్రల్లో  కనిపించనున్నారు.