హైదరాబాద్, వెలుగు: నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు తెలంగాణ నర్సస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రుడావత్ లక్ష్మణ్ కు ప్రతిష్టాత్మక “ఎక్సలెన్స్ నర్సింగ్ లీడర్ అవార్డ్–2026” లభించింది. జైపూర్‌లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఆర్ఐసీ)లో జరుగుతున్న గ్లోబల్ నర్సింగ్ సమిట్–2026లో ఆయన నాయకత్వ పటిమ, వృత్తిపరమైన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తెలంగాణ నర్సింగ్ అధికారులందరికీ దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఇదే వేదికపై 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో సాహసంతో ప్రాణాలు కాపాడిన నర్స్ అంజలి కుల్తేను లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిసి, ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు.
