మారుతి బాలెనో ఫేస్‌‌‌‌ లిఫ్ట్ ధర రూ.6.10 లక్షలు !

మారుతి బాలెనో ఫేస్‌‌‌‌ లిఫ్ట్ ధర రూ.6.10 లక్షలు !

మారుతి సుజుకి తమ సరికొత్త ‘బాలెనో ఫేస్‌‌‌‌లిఫ్ట్ 2026’ను లాంచ్  చేసింది. దీని ప్రారంభ ధర రూ.6.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఫీచర్లు, సేఫ్టీ విషయాల్లో భారీ మార్పులు ఏం లేవు. డిజైన్‌‌‌‌లో కొద్దిగా మార్పులు చేశారు.

కొత్త మోడల్‌‌‌‌లో రీడిజైన్ చేసిన ప్రొజెక్టర్ ఎల్‌‌‌‌ఈడీ హెడ్‌‌‌‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్‌‌‌‌తో పాటు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నాను అందించారు. ఇంటీరియర్‌‌‌‌లో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌‌‌‌మెంట్ స్క్రీన్‌‌‌‌తో బ్లూ-బ్లాక్ డ్యూయల్-టోన్ క్యాబిన్ డిజైన్‌‌‌‌ను కొనసాగించారు.